బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఛావా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్ర కోసం విక్కీ ఎలా కష్టపడ్డాడో మేకర్స్ చూపించారు.