12 ఏళ్ల క్రితం చిత్రీకరణ పూర్తి చేసుకుని, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'మదగజరాజ'. అదే పేరుతో ఈ నెల 31 తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాల్ పాడిన 'మై డియర్ లవరు' లిరికల్ వీడియో రిలీజ్ చేసింది. విశాల్ హీరోగా సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ హీరోయిన్లు.