దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న జాతా చిత్రం ‘శారీ’ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మలయాళీ భామ శ్రీలక్ష్మి సతీష్ (అలియాస్ ఆరాధ్య దేవి) లీడ్ రోల్ పోషిస్తోంది. ఒక వ్యక్తిపై ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.