నాగపూర్‌లో ఓ యువకుడు తన బైక్‌పై కూర్చున్న యువతిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. అనంతరం ఆమెను బైక్ మీద నుంచి కిందకు పడేసి పైకి లేవకుండా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత యువకుడి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.దేశంలో మహిళలకు భద్రత కరువైందంటూ పలువురు ఈవీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.