ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండానే గుండెపోటుతో ఉన్నట్టుండి కుప్పకూలి చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా లక్నోలోని సరోజినీ నగర్‌లో 25 ఏళ్ల న్యాయవాది నిలుచున్న చోటే గుండెపోతో కుప్పకూలి మృతి చెందాడు. రోడ్డు మీద నిలుచుని మరో వ్యక్తితో మాట్లాడుతో నడుస్తుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దాంతో చుట్టుపక్కలవారు వచ్చి సహాయం చేద్దామని చూసేలోపే అతడు మరణించాడు.