ఛార్జీకి డబ్బులు లేవని, ఆత్మాభిమానంతో ఎవరినీ అడుక్కోలేక ఓ వృద్ధుడు 600 కిలోమీటర్లు నడిచాడు. ఒడిశాలోని దుమరబెడకు చెందిన సోను బోత్రా (65) కూలి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. కానీ అక్కడ అతడిని చూసి ఎవరూ పెద్దగా పనికి తీసుకెళ్లలేదు. దీంతో ఛార్జీలకు సరిపడా డబ్బులు లేక 14 రోజుల పాటు నడుచుకుంటూ స్వగ్రామానికి చేరుకున్నాడు. మధ్యలో ఎవరైనా తిండి పెడితే అలసిపోయిన చోటే తిని విశ్రాంతి తీసుకుంటాడు.