మద్యం మత్తులో ఓ డ్రైవర్ రైల్వే ట్రాక్‌పై ఆటో నడిపాడు. బీహార్‌లోని సీతామర్హిలోని మెహసౌల్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. తాగిన మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రైల్వే ట్రాక్‌పై తన వాహనాన్ని నడిపాడు. పక్కనే ఉన్న ట్రాక్‌పై హైస్పీడ్ రైలు వెళ్ళింది. అదృష్టవశాత్తూ స్థానిక ప్రజల అప్రమత్తత కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.