భార్య, బామ్మరిదిని గొడ్డలితో నరికాడు

83చూసినవారు
భార్య, బామ్మరిదిని గొడ్డలితో నరికాడు
ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లి దీపాలదిన్నెపాలెంలో బుధవారం ఓ వ్యక్తి తన సొంత భార్య, బామ్మరిది, మామను గొడ్డలితో నరికాడు. కాగా, ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గరినీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్