భారత టెస్ట్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో.. తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనే టాపిక్‌పై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ R. అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. తన యూట్యూబ్ షో ఆష్కి బాత్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ తర్వాత జస్ప్రీత్ బుమ్రా భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీకి అర్హుడని అన్నారు. కోహ్లీ, రోహిత్ తప్పుకున్న నేపథ్యంలో జట్టులో సీనియర్‌గా ఉన్న బుమ్రా కెప్టెన్‌గా ఉండాలని అశ్విన్ పేర్కొన్నారు.