టీమ్‌ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. షమీకి వ్యక్తిత్వం లేదని.. తన క్రూరమైన మనస్తత్వంతో ఎంతగానో వేధించినట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. "మమ్మల్ని చంపడానికి మీరు ఎంతమంది క్రిమినల్స్‌ను కొన్నారు? ఆ డబ్బును మన కుమార్తె చదువుపై, నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఖర్చు చేసి ఉంటే, ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది. ఎంతో గౌరవంగా జీవించేవాళ్లం" అని హసీన్ రాసుకొచ్చారు.