ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లు పడగొట్టారు. షోయబ్ బషీర్ వికెట్ పడగొట్టడానికి ముందు ఆకాశ్‌కు ఐదు వికెట్ల ఘనత సాధించే అవకాశముంది. దీంతో ఐదో వికెట్ తీసే ఛాన్స్ ఇస్తానని ఆకాశ్‌తో చెప్పినట్టు సిరాజ్ తెలిపాడు. అందుకు ఆకాశ్ ‘వద్దు భయ్యా.. నువ్వు వికెట్ తీసుకో.. ఒకవేళ నాకు రాసిపెట్టి ఉంటే ఆ వికెట్ నాకే దక్కుతుంది’ అని అని అన్నాడట. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ ఐదు వికెట్ల కల నెరవేరింది.