ఆకాశ్ సాగర్ అనే హిందీ యూట్యూబర్‌కి అటు యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఆకాశ్ సాగర్ చేసిన చెత్త పని ప్రస్తుతం క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా చేసింది. మేఘలయా ట్రిప్‌కి వెళ్లిన ఆకాశ్ ఓ చర్చ్‌లోకి వెళ్లి అందరిముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌లోని జై సియా రామ్ అనే పాట పాడడంతో పాటు.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.