ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా, చైనాకు చెందిన ఓ యువకుడు పెట్టిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. ఆ యువకుడు ఆక్స్‌ఫర్డ్ తో పాటు ఇతర ప్రముఖ యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పొందినప్పటికీ, తగిన ఉద్యోగం దొరకక డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని బాధతో పేర్కొన్నాడు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.