అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ (40) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో 11A సీటులో కూర్చున్న విశ్వాస్, ప్రమాదం జరిగిన క్షణాల్లోనే తన ముందున్న ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. సాధారణంగా 11A సీటుకు కిటికీ ఉండదు కాబట్టి.. ప్రయాణికులు ఆ సీటును ఎంచుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ అదే సీటు విశ్వాస్‌కు ప్రాణ భిక్ష పెట్టింది.