ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు నాలుగో స్థానం ఎవరిని ఆడించాలనేది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న కరుణ్ నాయర్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేయాలని లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సూచించారు. ప్రస్తుతం IPLలో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతనికి కోహ్లీ ప్లేస్‌లో ఛాన్స్ ఇవ్వాలని అన్నారు.