సీఎం రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

70చూసినవారు
సీఎం రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
TG: జన్వాడ ఫాంహౌస్‌ వద్ద డ్రోన్‌ ఎగురవేశారంటూ 2020 మార్చిలో రేవంత్‌ రెడ్డిపై అప్పటి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నార్సింగి పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని నాలుగేళ్ల క్రితం తెలంగాణ హైకోర్టులో రేవంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మరో సీనియర్‌ న్యాయవాది ఈ కేసును వాదిస్తారని రేవంత్‌ తరఫు లాయర్ తెలిపారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్