వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 70కి పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం కేసులను పరిశీలిస్తోంది. పలు అంశాలపై వ్యక్తులు, సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేయగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాదనలను వినాలని కోర్టును కోరింది. వక్ఫ్ చట్టం చట్టబద్ధత, అమలులో ఉన్న సవాళ్లు, సంబంధిత హక్కులపై ఈ విచారణ జరుగుతోంది.