కంచె గచ్చిబౌలి భూముల కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ

55చూసినవారు
కంచె గచ్చిబౌలి భూముల కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ
తెలంగాణలోని హైదరాబాద్‌ కంచె గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమి వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది. గత విచారణలో సుప్రీం కోర్టు.. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అలాగే, తదుపరి విచారణ వరకూ స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్