సీఎం రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గచ్చిబౌలి PSలో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు. గోపన్‌పల్లిలో భూవివాదంలో ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు 2016లో రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం RR జిల్లా కోర్టులో కేసు విచారణ ఉంది. 2020లో కేసును కొట్టేయాలంటూ రేవంత్ వేసిన పిటిషన్ తిరస్కరించడంతో HCని ఆశ్రయించాడు.