TG: కంచ గచ్చిబౌలి భూములపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతి తీసుకున్నారా లేదా? అనేది స్పష్టంగా చెప్పాలని కోర్టు కోరింది. అనుమతి తీసుకున్నాకే చెట్లు తొలగించామని ప్రభుత్వ లాయర్ సమాధానం ఇచ్చారు. కాగా ఈ పిటిషన్ విచారణను ధర్మాసనం వచ్చే నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది.