TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, సైదాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, కిషనబాగ్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్.. ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వర్షం కురిసింది.