భారీ వర్షం.. అకస్మాత్తుగా కూలిన కాంపౌండ్ గోడ (వీడియో)

65చూసినవారు
కర్ణాటక తీర ప్రాంతాల్లో ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళూరు నగరంలో పెను ప్రమాదం తప్పింది. సువర్ణలేన్ ప్రాంతంలో భారీ కాంపౌండ్ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గోడ కూలిన వెంటనే, సమీపంలోని విద్యుత్ స్తంభం సైతం విరిగి పడింది. దీంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్