TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, వనపర్తి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని ఉప్పల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.