హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, మాదాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్, చంచల్ గూడ వంటి పలు ప్రాంతాల్లో రాత్రంతా వాన పడుతూనే ఉంది. శుక్రవారం కూడా నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉండటంతో, మరో రెండు నుంచి మూడు గంటలపాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.