హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వచ్చే రెండు రోజులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాతావరణం మారిపోయి వర్షం పడుతుంది.