బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.