బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో 24, 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.