TG: రాష్ట్రంలో శనివారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రేపు (ఆదివారం) ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి వర్షం పడింది.