తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో వర్షాలు ముమ్మరంగా కురుస్తున్నాయి. ఆంధ్రాలో పిడుగులతో కూడిన వానలు మోస్తరు నుంచి భారీగా కురిసే సూచనలతో ప్రజలను APSDMA అప్రమత్తం చేసింది. తెలంగాణలో నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, గద్వాల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.