తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు APSDMA పేర్కొంది.