ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, VKB, సంగారెడ్డి, MDK, నల్గొండ, HYD జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కూరుస్తాయని పేర్కొంది. అటు APలోని ఉమ్మడి ఉభయ గోదావరి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.