తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.