రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

66చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
TG: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు ముమ్మరంగా కురుస్తున్నాయి. అయితే తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్