తెలంగాణలో రాగల 4 రోజులు భారీ వానలు

62చూసినవారు
తెలంగాణలో రాగల 4 రోజులు భారీ వానలు
తెలంగాణలో రాగల 4 రోజులు భారీ వానలు పడే అవకాశాలున్నాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. సోమవారం వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్