తెలంగాణలో ఈ రోజు నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నేడు కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, MDK, SRD, ములుగు, భద్రాద్రి, KMM, MBBD, మహబూబ్నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.