మహారాష్ట్రలో వానలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. నాసిక్‌లోని పంచవతి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ ఉన్న ఆలయాలు, వంతెనలు, తీర ప్రాంతంలోని అనేక నిర్మాణాలు నీటమునిగాయి. గంగాపూర్ డ్యాం పరిసర ప్రాంతాల్లోనూ గోదావరిలో నీటిమట్టం బాగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గంగాపూర్ డ్యాం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.