ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ రాజ్‌వీర్ సింగ్ చౌహాన్ భారత సైన్యంలో 15 ఏళ్లకు పైగా సేవలందించారు. విమానాలు నడిపే విషయంలో ఆయనకు గొప్ప అనుభవం ఉంది. జైపూర్‌లో నివసిస్తున్న చౌహాన్.. 2024 అక్టోబర్ నుంచి ఆర్యన్ ఏవియేషన్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ జరిగిన బెల్ 407 హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.