ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా మొత్తం ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతులు పైలట్ రాజ్‌వీర్, విక్రమ్ రావత్, త్రిష్టి సింగ్, వినోద్, రాజ్, శ్రద్ధ, రాశి (10)గా అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో కూలిపోగానే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని అందరూ సజీవదహనం అయ్యారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.