జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. అనంతరం నూతన ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎం చైర్మన్ అయిన సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. తాజాగా మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జేఎంఎం కూటమి 54, బీజేపీ కూటమి 24, ఇతరులు ఒక స్థానంలో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 28న సోరెన్ మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.