కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు ఆయనకు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం కార్తీ సర్దార్-2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కార్తీ తన 29వ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.