APలో సినీ హీరో మహేష్‌బాబు ఓటు హక్కును తొలగించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల MLC ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గుంటూరులో బూత్ నంబర్ 2014లో మహేశ్ పేరుతో ఓటు నమోదైంది. అయితే ఆయన పేరుతో ఓటు తప్పుగా నమోదైందని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఫారం-7 విచారణ అనంతరం ఓటును తొలగించామని చెప్పారు. ఆయన HYDలోని జూబ్లిహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.