హీరోయిన్ ఇషికా దత్తా మరోసారి తల్లి అయ్యారు. 2017లో బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను ఇషికా పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే వీరికి ఓ కుమారుడు ఉన్నారు. తనకు పండంటి కూతురు పుట్టిందంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇషికా తెలుగులో తనీశ్ హీరోగా నటించిన 'చాణక్యుడు' మూవీలో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా కనిపించారు. వత్సల్ సేథ్ 'ఆదిపురుష్' మూవీలో నటించారు.