టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది. నిధి ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు మూవీ’లో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలోనే నిధి పూజలు చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మూవీ విజయవంతమై కెరియర్ గాడిలో పడాలని వేణుస్వామితో పూజలు చేయించినట్లుగా తెలుస్తోంది.