భారత్-పాక్ ఉద్రిక్తల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఢిల్లీలో పోలీసు ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఢిల్లీలోని అన్ని ప్రముఖ ప్రదేశాల్లో పోలీసులు జనసంచారం నిషేధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను పోలీసులు మూసేశారు. ఇప్పటికే పాకిస్తాన్ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌పై భారత వాయుసేన, నౌకాదళం దాడులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.