సీఎం రేవంత్, భట్టి మధ్య విభేదాలున్నాయని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం రెండుగా చీలిపోయిందని ఆరోపించారు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గం అసంతృప్తిగా ఉందన్నారు. పదేళ్లు మళ్లీ అధికారం రాదని మంత్రులు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకల్‌బాడీ ఎన్నికల తర్వాత సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఎదురుచూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.