HYD మెట్రో రెండో దశ పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

84చూసినవారు
HYD మెట్రో రెండో దశ పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. నగరంలోని చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్ దగ్గర పనులు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వారసత్వ కట్టడాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్‌పై ఈ మేరకు విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. తదుపరి విచారణ వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్