కరీనా కపూర్‌కు హైకోర్టు నోటీసులు

69చూసినవారు
కరీనా కపూర్‌కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రెగ్నెన్సీ బైబిల్‌: ది అల్టిమేట్‌ మ్యానువల్‌ ఫర్‌ మామ్స్‌ టు బి’ పుస్తకంలో బైబిల్‌ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్‌ అంథోనీ వేసిన పిటిషన్‌లో భాగంగా ఈ నోటీసులను పంపింది. దీనిపై తొలుత ఆయన ట్రయల్‌ కోర్టును ఆశ్రయించగా, 2022 ఫిబ్రవరి 26న కోర్టు ఈ అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్