తెలంగాణ హైకోర్టు బీఈడీ అభ్యర్థులకు మంగళవారం ఊరట కలిగించింది. డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో అర్హులైన వాళ్లతో 1,382 కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు MLC ఎన్నికల కోడ్ అడ్డంకి కాబోదని చెప్పింది. కోడ్ పేరుతో నియామకాలను మళ్లీ వాయిదా వేయడానికి వీల్లేదని ఆదేశించింది. ఈనెల 10వ తేదీలోగా పోస్టింగ్‌లు ఇవ్వాలని హెచ్చరిస్తూ.. విచారణను వాయిదా వేసింది.