బిభవ్ కుమార్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

85చూసినవారు
బిభవ్ కుమార్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం రిజర్వ్‌ చేసింది. శుక్రవారం(జూలై 12న) కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. స్వాతి మలివాల్‌పై మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్