తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది. ఎనిమిది వారాలు అవుతున్నా నివేదిక ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై పది రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని కోర్టు రేవంత్ రెడ్డి సర్కారుని ఆదేశించింది.